Friday, September 24, 2010

పాప తోడుగా పార్లమెంట్ కు

యూరోపియన్ పార్లమెంట్‌లో ముప్పై ఏళ్ల లిసియా రోన్‌జుల్లి - ఇటాలియన్ సభ్యురాలు. ఇటీవల పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో తన నెల పాపని నడుంకి కట్టుకొని వచ్చింది. 

నా కూతురు విట్టోరియాని పార్లమెంట్ సెషన్స్‌కి తీసుకురావటం వెనుక - వ్యక్తిగత జీవితం.. ఉద్యోగ బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరన్న అంశాన్ని చాటి చెప్పటానికే’ నంటోంది.

బేబీ కేర్ సెంటర్లు లేవా? లేక ఇంట్లో ఆయాలు లేరా? అన్న ప్రశ్నని పక్కనపెట్టి - ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా? మరోటి అనుకున్నా? తన పరిస్థితిని ‘సింబాలిక్’గా వివరించింది


ఎవరెన్ని అర్థాలు మాట్లాడుకున్నా.. తన వాదనని నిర్మొహమాటంగా తెలియజేసి మహిళల స్థితిగతులను లోకానికి చాటింది.

జీవితం ఓ కప్పు కాఫీ లాంటిది.

లైఫ్ ఇస్ లైక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ....జీవితం గురించి ఓ ప్రొఫెస్సర్ , ఆయన స్టూడెంట్స్ కి జీవితాన్ని  కాఫీ మరియ కప్పులతో  పోలుస్తూ ఎంత చక్కగా చెప్పాడో  చూడండి

 ">

Sunday, September 19, 2010

శ్రీ కుందుర్తి " తెలంగాణా" కు పీటికలో గోపీచంద్ గేయ రచన

ఇది తెలంగాణా కన్నీటి గాథ
ఒక మహా కవి యేగాజిమ్మిన
అగ్ని కణాల రొద,
తల్లి రాల్చిన అశ్రుకనాలివి 
వాటిసేగల పొగల వెనక
ఆకృతిని నిర్మించి, మనసులను కరిగించి
ఆర్ద్రతను పెంచి , లోకపు చీకట్ల
దివ్వెలను వెలిగించి, హద్దులను మరిపించి
విశ్వ దృష్టిని  పెంచు ఈ కవి,
ఓ కవీ, నీకు శుభము
మాతృశ్రీ కన్నీటి చుక్కలకు
నవ్యరీతులు దిద్దిన నీకు శుభము
శ్రీ శ్రీ భుజములపైనుంచి
లోకమును పరికించు, నీకు శుభము
దీనుల ఆర్తారవముల  నినదించు
లోకకల్యానమునకై పరితపించు
కవీ, ఓ కవీ, నీకు శుభము


(గోపీచంద్ స్మారక సంచిక నుంచి, రచనలో ప్రచురితమయినది  )

Wednesday, September 1, 2010

రాజశేఖరా ....



అప్పుడే  సంవత్స్తరం అయిపోయిందా ......ఇంకా ఆ జ్ఞాపకాలు మనసులో పచ్చిగానే మనసును కోస్తూ..... ఆ రోజు నిజంగా ఎంత టెన్షన్... ఎంత మంది గుండెలు పట్టుకొని , టి.వి. లకు అతుక్కొని...... ఎ వానల కొరకు పాద యాత్రలు చేసాడో,  ఆ వానలోనే ..ప్చ్ .....అయినా ఆ దేవుడికి కరుణ లేదు. పార్టీలకు అతీతంగా ఆలోచించిన, ఎలా ఆలోచించినా ఒక మంచి లీడర్, ప్రజలకు దగ్గరి మనిషి,  ప్రజా నాయకుడు. ఆ హుందాతనం, ఆ నవ్వు  ఇంకేవరిలో కనిపించవు .  రాజశేఖరా అందుకో మా నివాళులు