Sunday, September 19, 2010

శ్రీ కుందుర్తి " తెలంగాణా" కు పీటికలో గోపీచంద్ గేయ రచన

ఇది తెలంగాణా కన్నీటి గాథ
ఒక మహా కవి యేగాజిమ్మిన
అగ్ని కణాల రొద,
తల్లి రాల్చిన అశ్రుకనాలివి 
వాటిసేగల పొగల వెనక
ఆకృతిని నిర్మించి, మనసులను కరిగించి
ఆర్ద్రతను పెంచి , లోకపు చీకట్ల
దివ్వెలను వెలిగించి, హద్దులను మరిపించి
విశ్వ దృష్టిని  పెంచు ఈ కవి,
ఓ కవీ, నీకు శుభము
మాతృశ్రీ కన్నీటి చుక్కలకు
నవ్యరీతులు దిద్దిన నీకు శుభము
శ్రీ శ్రీ భుజములపైనుంచి
లోకమును పరికించు, నీకు శుభము
దీనుల ఆర్తారవముల  నినదించు
లోకకల్యానమునకై పరితపించు
కవీ, ఓ కవీ, నీకు శుభము


(గోపీచంద్ స్మారక సంచిక నుంచి, రచనలో ప్రచురితమయినది  )

No comments:

Post a Comment