Friday, September 24, 2010

పాప తోడుగా పార్లమెంట్ కు

యూరోపియన్ పార్లమెంట్‌లో ముప్పై ఏళ్ల లిసియా రోన్‌జుల్లి - ఇటాలియన్ సభ్యురాలు. ఇటీవల పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో తన నెల పాపని నడుంకి కట్టుకొని వచ్చింది. 

నా కూతురు విట్టోరియాని పార్లమెంట్ సెషన్స్‌కి తీసుకురావటం వెనుక - వ్యక్తిగత జీవితం.. ఉద్యోగ బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరన్న అంశాన్ని చాటి చెప్పటానికే’ నంటోంది.

బేబీ కేర్ సెంటర్లు లేవా? లేక ఇంట్లో ఆయాలు లేరా? అన్న ప్రశ్నని పక్కనపెట్టి - ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా? మరోటి అనుకున్నా? తన పరిస్థితిని ‘సింబాలిక్’గా వివరించింది


ఎవరెన్ని అర్థాలు మాట్లాడుకున్నా.. తన వాదనని నిర్మొహమాటంగా తెలియజేసి మహిళల స్థితిగతులను లోకానికి చాటింది.

1 comment: