అయోధ్య చారిత్రాత్మక తీర్పు తర్వాత, వచ్చిన వార్తలలో నన్ను ఆకర్షించిన వార్త ఏంటంటే " అయోధ్య లో రామాలయ నిర్మాణం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయల విరాళం". దీనిలో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా. ప్రకటించింది ఎవరనుకుంటున్నారు, "షియా హుస్సేనీ యువజన సంఘం" నిజంగానేనా? ఎన్నో రోజులుగా సాగుతూ వచ్చిన ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుదామంటూ ఆ సంస్థ చీఫ్ శామీల్ శంషీ వెల్లడించారు. ఇంతే ననుకున్నారా, అలహాబాద్ హై కోర్ట్ తీర్పు పై సుప్రీంలో అప్పీల్ చేయవద్దని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ను అడగనున్నట్లు తెల్పుతూ, ఈ తీర్పు పై దేశంలోని ముస్లిం లందరూ అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ఇది అందరం ఆహ్వానించదగ్గ విషయం.
నిజంగా అందరు ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండు. ఈ గొడవలు ఉండకపోవు కదా! కనీసం ఇప్పటికయినా కోర్ట్ తీర్పుని గౌరవించి ఉంటె బాగుంటుందేమో. అయినా ఈ రాజకీయ నాయకులు ఎవరు ఊరుకుంటారు. వాళ్లకు ఏదో ఒకటి కావాలికదా. ప్రజల్లోకి పోవటందుకు వాళ్లకు ఇటువంటి ఇస్సులను వాడుకుంతూనే ఉంటారు. మధ్యలో నలిగేది మామూలు జనం.
ఇంకా ఎవరో అన్నట్లు " లాష్ లక్నో మే హీ దఫన్ హో, ఢిల్లీ మే నహిన్ " ఈ వివాదం యొక్క శకలాలు, ఎమన్నా ఉంటె అవి లక్నో లోనే బూడిద చెయ్యాలి కానీ డిల్లీ లో కాదు. ఇంతటితో దీన్ని వదిలేస్తే బావుంటుంది. 90 ఏళ్ళ హాషిం అన్సారి అయోధ్య వాసి అంటారు బయటి వాళ్ళ ప్రమేయం లేనంత వరకు అయోధ్య ఎప్పుడు ప్రశాంతంగానే ఉంది, " it....is a town where Muslims supply flowers for the temples".
Amazing..
ReplyDeleteఅదేంటి? ఇలాంటి మాటలు మాట్లేడే హిందులువులని కుహనా లౌకిక వాదులు అంటున్నాం కదా! ఆ లెక్కన వీళ్ళు ముస్లీములలో కుహనా లౌకిక వాదులు అయ్యుంటారేమో!!
ReplyDeleteabbo.. eamdi amaazing.. isn't it normal? why we think they are exceptional events?
ReplyDeleteఇటువంటి పోస్ట్ చదివితేనే ఎంతో హాయిగా ఉంది. ఇలాంటివి రాస్తుండండి.
ReplyDeleteBusiness has nothing to do with religion. Even in our town, people purchase flowers from Muslim merchants at the time of Sankranti.
ReplyDeleteGood to know.
ReplyDeleteఇది మరీ అంత విచిత్రమైన వార్తేం కాదు ... సున్నీలకు షియాలకు వర్గ పోరు అందుకే వాళ్ళు అలా చేసుంటారు. బాబ్రీ మసీదు నిర్మించాడని చెపుతున్న బాబరు సున్నీ. ఔరంగజేబు హయాంలో షియాలను దారుణంగా అణచివేసాడు . మన హైదరాబాదు కుతుబ్ షాహీలను కూడా ఇలానే అణచివేసి హైదరాబాదును మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసాడు . అప్పట్లో హైదరాబాదును తానీషా (షియా) పాలించేవాడు . అతని హయాంలోనే గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది . ఇంతకంటే మంచి ఉదాహరణ సద్దాం హుస్సేన్ ... ఇతనుకూడా ఇరాక్ లో షియాలను దారుణంగా వధించేవాడు . సద్దాం సున్నీ వర్గీయుడు
ReplyDeleteస్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteituvanti manchi vaarthalu jeevitham meeda aasha kaligisthundi. Manam ee vishayalu entha mandiki theliya jesthe antha manchidi.
ReplyDelete