గ్వటెమల లో సుమారు ఏడు వందల మంది ఖైదీలు, మానసిక రోగులు, సైనికులు అమెరికన్ వైద్యుల ప్రయోగాలకు గినీ పిగ్స్ లా ఉపయోగపడ్డారని, 1946 -48 మధ్య కాలం లో జరిగిన ఈ అకృత్యాలు వెలుగులోకి రావడంతో , అమెరిక విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ వెంటనే గ్వాటెమాలా కి క్షమాపణలు చెప్పింది. బాదితులందరికి కూడా క్షమాపణలు చెబుతున్నామని , పశ్చాత్తాపం తెలిపి చేతులు దులిపేసుకున్త్ది .
అసలు గ్వాటెమాలా లో ఏమి జరిగిందో తెలిస్తే , మన వళ్ళు జలదరిస్తుంది. గ్వాటెమాలా ఖైదీలను, మానసిక రోగులను, సైనికులను అమెరికన్ వైద్యులు తమ ప్రయోగాల కోసం గినీ పిగ్స్ మాదిరిగా ఉపయోగించుకొన్నారట , ఎంత అమానుషం. పెన్సిలిన్ ప్రభావాన్ని పరీక్షించేందుకు వారికి బలవంతంగా సిఫిలిస్ క్రిములను ఎక్కిన్చారట. ఖైదీలకు సిఫిలిస్ అంటగట్టేందుకు ఆ వ్యాధి సోకిన సెక్స్ వర్కర్లను ఉపయోగించేవారట. సెక్స్ వర్కర్ల ద్వారా సిఫిలిస్ సోకకుంటే, ఖైదీల జననంగాలకు, భుజాలకు, ముఖానికి గాట్లు పెట్టి, ఆ గాయాలపై సిఫిలిస్ బాక్టీరియా ను వెదజల్లేవారట . కొన్ని సందర్బాలలో ఏకంగా ఖైదీలు , మానసిక రోగుల వెన్నెముకలకు సిఫిలిస్ క్రిములను ఇంజెక్ట్ చేసేవారట. సిఫిలిస్ సోకిన తర్వాత వారికి పెన్సిలిన్ ఇచ్చేవారు. వారి ప్రయోగాలలో సిఫిలిస్ నయమయ్యింది లేనిది మాత్రం తెలపలేదు.
వ్యక్తుల అనుమతి తీసుకోకుండానే, వారి శరీరాల్లోకి రోగ క్రిములను ఎక్కించడం ఎంత దారుణం. ఎంత అమానుషం. కొస మెరుపు ఏంటంటే, ఇంత దారుణమయిన అకృత్యాలు జరిగినా, అమెరికా విదేశాంగమంత్రి, ఓ చిన్న క్షమాపణ , ఓ పశ్చాత్తాపం , అమెరిక అధ్యక్షుల వారు కూడా, ఓ క్షమాపణ తెలిపి తమ విచారం వెలిబుచ్చారు. అగ్ర రాజ్యాలు ఏమి చిసినా చెల్లుతున్దనా!
అగ్ర రాజ్యాలు ఏమి చిసినా చెల్లుతున్దనా!
ReplyDeleteఅంతే కదా మరి.
rajyala sanganthi atlaage untaadhi
ReplyDeleteఉగాండాలో ఈదీ అమీన్ తన రాజకీయ ప్రత్యర్థులని జైళ్లలో చిత్ర హింసలు పెట్టించినప్పుడు అమెరికావాళ్లు విమర్శించారు. శాడిస్టిక్ పనులు తాము చేస్తే తప్పు కాదు కానీ ఇతరులు చేస్తే తప్పు అని అమెరికావాళ్ల అభిప్రాయం.
ReplyDeletekallaku kattinatlu undhi meeru chebutunte.chala dharunam
ReplyDeleteappude kadu. netiki eenatiki prati drug company tana kaotta praduct (new drug) nu test cheyyadaniki mana lanti deshalanu eppatiki wadukontunnaye.( espacially in vaccine development)
ReplyDeleteస్మాల్ పాక్స్ తో కంటామినేట్ అయిన దుప్పట్లు పంచి రెడ్ ఇండియన్స్ ని మట్టు బెట్టిన ఘన చరిత్ర అమెరికన్ లది. మానవ హక్కులు అని గొంతు చించికొనే వీళ్ళకి అవెవీ పట్టవు. వీళ్ళ దృష్టిలో మనుషులంటే అమెరికన్లే.
ReplyDeleteఅది సరే కానీ... కొన్ని శతాబ్దాల క్రితం ముస్లిం రాజుల కిరాతకం , హిందువుల మీద దౌర్జన్యాలు మనకందరకీ తెలుసు.... అందువల్ల మొత్తం ముస్లిం జాతి ని అందులొ ఇప్పటి తరం ముస్లింలను తూర్పారపడదామా ??? ఒక్కసారి జులియన్ వాలాబాగ్ గుర్తుకుతెచ్చుకుని ఇప్పటి తరం బ్రిటిష్ తరానికి ఈ రకమయిన ట్రీట్మెంట్ ఇద్దాం మరి... నాజీల అరాచకాలను తలుచుకుంటూ ఇప్పటి తరం జర్మనీని వెలివెయ్యం ఎమిటి ?? అప్పటి జార్ చక్రవర్తులనుండి నిన్నటి స్టాలిన్ వరకూ నిరంకుశత్వమే పరిపాలనగా అంత్యంత దారుణాలు చేసిన రష్యన్ లను వదిలెసామెంటి...అలాంటి వారి దగ్గర మన సైనిక సహకారం పొందడం ఎమిటి ..అసహ్యం గా ???
ReplyDeleteఫ్రెండ్స్ ... సగటు అమెరికన్ చాలా మంచొడు.. 1950 లొ కొందరు లెక మొత్తం ప్రబుత్వ నిర్ణయాలబట్టి ఇప్పటి తరం సగటు అమెరికన్స్ ని విమర్శించడం మూర్ఖత్వం... ఒక రేస్ ని బట్టి, కులాన్ని బట్టి , మతాన్ని బట్టి జెనరలైజిడ్ కామెంట్స్ ఇవ్వడం మంచిదికాదు... (ఉదాహరణకి పైన చెప్పుదెబ్బలు రాసినట్టు... అమెరికన్స్ ల చరిత్ర నీచం, ముస్లిం ల చరిత్ర ఘొరం, జర్మన్ల చరిత్ర క్రూరత్వం...ఇలా ) ....
ఒక రకం గా విచారం వెళ్ళుబుచ్చి వారి నిజాయితీ చాటుకున్నారు... అంతకు మించి ఇంకా చెసేదీ లేదు... ప్రపంచం లొ ఏ జాతి , ఏ మతం చూసుకున్నా ఇలాంటి అకృత్యాలు కుప్పలకొద్ది ఉంటాయి... వాటిగురించి ఇప్పటి తరం వారు పెద్దగా ఎవ్వరూ క్షమాపణ చెప్పిన దాఖలాలు లేవు...
1940స్ ప్రాబ్లెంస్ మనకెందుకు కానీ ఈ నాటి భూతల నరకాలయిన నార్త్ కొరియా, సూడాన్, తదితర దేశాలగురించి మీకేమయినా తెలిస్తే చెప్పండి
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteExcellent Manchu.
ReplyDeleteJust about to write the same and found your words. Can't agree more!