రాజీ గృహకల్ప్,
రాజీవ్ ఉద్యోగ శ్రీ,
రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయము
రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం,
రాజీవ్ స్వగృహా,
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం,
రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్,
ఇవన్ని చదివాక మీకు ఈ పాటికి అర్థం అయ్యిందనుకుంటా , నేను ఎం చెప్పదలుచు కున్ననో. ఇవ్వన్ని సరిపోలేదు (ఇవి కాకా ఇంకా ఎన్నో ఉన్నాయి) అన్నట్లుగా, ఇప్పుడు మళ్ళి రాష్ట్ర ప్రభుత్వం" తెలుగు లలిత కళా తోరణం" కుడా రాజీవ్ మయం చేసేసింది. ఎంత అన్యాయం, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని డిల్లి అధిష్టానం కాళ్ళ దగ్గర మరొక్కసారి స్వంత ప్రయోజనాల కొరకు తాకట్టు పెట్టారు.
ఇంకా ఎం చూడాల్సి వస్తుందో. రాత్రికి రాత్రి, మన రాష్ట్రం పేరు మార్చేయ గలరు. మనం తెల్ల వారి లేచి చూసే సరికి " రాజివాన్ధ్రప్రదేశ్" అవుతుందేమో ఏదో ఒక రోజు. చార్మినార్ రాజీవ్ మినార్ గా, తిరుమల కొండలు కుడా చివరికి రాజీవ్ కొండలు చేస్తారేమో !. ప్రతీ ముఖ్యమంత్రి తమ పేరు కు ముందు రాజీవ్ అని తగిలించుకుంటే బాగుంటుందేమో.
రాజీవ్, ఇందిరా అనుమానం లేదు వాళ్ళు మన నేతలు. అంత మాత్రం చేత దేనికి పడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా. చివరికి టాయిలెట్స్ కి పెట్టేలా తయారవుతున్నారు. దీనికి ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టక తప్పదు, లేకపోతె వాళ్ళ గౌరవం ఆ పార్టీ నాయకులే మట్టిలో కలిపేల ఉన్నారు.
ఆసక్తి గల వాళ్ళు "రాజీవ్ ని మా మీద రుద్దొద్దు -అనే వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టండి" సుజాత గారి బ్లాగ్ చదవండి.
ఆసక్తి గల వాళ్ళు "రాజీవ్ ని మా మీద రుద్దొద్దు -అనే వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టండి" సుజాత గారి బ్లాగ్ చదవండి.
భాను గారూ, అన్నీ రాజీవ్ కే ఇవ్వాలంటే కష్టమండీ.. ఇంకా ఇందిరమ్మకి ఇవ్వాలా? రేపు రాహుల్ కేమి మిగులుతుంది? ఊర్లు వై ఎస్ విగ్రహ ప్రతిష్టలకీ, .ల్లాల పేర్లు కాంగ్రెస్ లో లోకల్ నాయకులకి వదిలేశారు కదా.
ReplyDeletePersonally, నాకు రాజీవ్ కొండలు నచ్చింది... :) కాస్త ముద్దుగా కూడా ఉంది.