Saturday, October 23, 2010

ఒగ్గు కథకుడు మిద్దె రాములు ... క్యాన్సర్ ఆస్పత్రిలో...

ఈ రోజు నాకో  s.m.s. సందేశం. " తెలంగాణా ఒగ్గు కథకుడు మిద్దె  రాములు కు క్యాన్సర్ . యెన్ .టి.ఆర్. క్యాన్సర్ హాస్పిటల్ లో 3rd ఫ్లోర్ , బెడ్ నేఁ ౩౨౪, పైసలు లేక ఇబ్బందులు. ప్లీస్  హెల్ప్ ఫైనాన్సియల్లీ "  చూడగానే మనసు కాసేపు చలించింది.

ఒగ్గుకతకు అంతర్జాతీయ క్యాతిని  తెచ్చిన వ్యక్తి మిద్దె రాములు. నిరక్షరాస్యుడైనా  భాష, యాసను తానె రచిస్తూ, తనదైన శైలిలో చిన్నప్పటినుంచి ఒగ్గుకతకు ప్రాణం పోస్తూ , కథే ప్రాణంగా జీవించిన వ్యక్తి.  అతని గ్రామానికే చెందిన మరో తెలుగు ముద్దు బిడ్డ శ్రీ సి.నా.రే.సహకారంతో అంచలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. రాములు కథ వినిపిస్తున్నారంటే తెలంగాణా జిల్లలల్లో గ్రామీణ ప్రాంతాలల్లో జనాలు వినేందుకు తండోపతండాలుగా తరలి వస్తారంటే అతిశయోక్తి కాదు. నెత్తిన బోనంతో ఒగ్గు కథ ప్రారంభించాడంటే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సభాస్తలి వద్దకు చేరుకొని శ్రద్ధగా ఆలకిస్తారు.  1990 లో ప్రపంచ తెలుగు మహా సభలో తన కథలు ప్రదర్శించి తెలుగు వారిని అబ్బురపరిచిన రాములు, అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్  సింగ్ , ప్రధాన మంత్రి ఇందిరా ప్రశంసలు అందుకున్నారు.

ప్రస్తుతం క్యాన్సర్ తో హైదరాబాద్ లో చికిత్శ పొందుతున్నారు. చుడతందుకు పోయిన సాక్షి బృందం తో అయన భార్య దేవవ్వ " చిన్నప్పట్నుంచి  ఒగ్గుకతనే నమ్ముకుని బతికిండు.గవర్నమెంట్ గురించి జనాలకు తెలిసే విధంగా కథలు అల్లిండు.అందరికి అర్థం అయ్యేలా కథలు చెప్పిండు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదయ్యా. ఇప్పటికే  ఆరు లక్షలు ఖర్చయినాయి. ఏమి లాభం లేదు. మంచంల ఉంది గుడా ఒగ్గుకతకే అంటుండు" అంటూ రోదిన్చిందట.

ఈ వార్త చుసిన తర్వాత ప్రభుత్వం అన్ని విధాల ఆడుకొంతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టి.ఆర్. ఎస్ అధినేత కే.సి.ఆర్ కుడా పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష ఇవ్వడం తో పాటు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. సంతోషించాల్సిన విషయం. రాములు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకోవాలని ఒగ్గుకతకు ప్రాణం పోశిన , ఆ ఒగ్గు కథే అతన్ని నిలబెట్టాలని  ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ.......

2 comments:

  1. Bhanu gaaru,,meeradigina question nenu repeat chestunna? meerevaru, yaadkenchi vachchaaru, jera cheppuraaduri..ammo inni feeldullo praaveenyamaa inni vaartala..baaboy..naaku blaag mooseyyalanipinchindi modati saari..
    perlu avee teliyavu kaanee oka famous oggu katha brindam vachchi maa golla mallamma gaarintlo 10 rojulu cheppevaaru roju....naaku bhale nachchedi telusaa..taravaata yeppudu chance raaledinka..so sad

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఎన్నెల గారూ మీరు మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారు అంట సీన్ లేదు ఏదో నచ్చింది రాయడం తప్ప. మీ అనుభవం షేర్ చేసినందుకు కామెంటినందుకు మరొక్కసారి ధన్యవాదాలు

    ReplyDelete