కార్పోరేట్ కాలేజీల్లో పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారో , సరదా గా చూపించిన ఓ వీడియో, చూసి ఎంజాయ్ చేయండి. ఇదీ బొమ్మరిల్లు సినిమా లోని మంచి సీన్ కి ఓ పేరడీ.
స్పందన
Sunday, November 7, 2010
what a girl wants 2 hear ...n what a boy thinks
ఒక అమ్మాయి ఏమి వినాలనుకుంటుందో , ఆ అబ్బాయి ఏమి ఆలోచిస్తున్నాడో చూడండి ఈ క్రింది వీడియో.
Monday, October 25, 2010
అంతా రాజీవుని మయం
రాజీవ్ ఆరోగ్య శ్రీ,
రాజీ గృహకల్ప్,
రాజీవ్ ఉద్యోగ శ్రీ,
రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయము
రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం,
రాజీవ్ స్వగృహా,
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం,
రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్,
ఇవన్ని చదివాక మీకు ఈ పాటికి అర్థం అయ్యిందనుకుంటా , నేను ఎం చెప్పదలుచు కున్ననో. ఇవ్వన్ని సరిపోలేదు (ఇవి కాకా ఇంకా ఎన్నో ఉన్నాయి) అన్నట్లుగా, ఇప్పుడు మళ్ళి రాష్ట్ర ప్రభుత్వం" తెలుగు లలిత కళా తోరణం" కుడా రాజీవ్ మయం చేసేసింది. ఎంత అన్యాయం, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని డిల్లి అధిష్టానం కాళ్ళ దగ్గర మరొక్కసారి స్వంత ప్రయోజనాల కొరకు తాకట్టు పెట్టారు.
ఇంకా ఎం చూడాల్సి వస్తుందో. రాత్రికి రాత్రి, మన రాష్ట్రం పేరు మార్చేయ గలరు. మనం తెల్ల వారి లేచి చూసే సరికి " రాజివాన్ధ్రప్రదేశ్" అవుతుందేమో ఏదో ఒక రోజు. చార్మినార్ రాజీవ్ మినార్ గా, తిరుమల కొండలు కుడా చివరికి రాజీవ్ కొండలు చేస్తారేమో !. ప్రతీ ముఖ్యమంత్రి తమ పేరు కు ముందు రాజీవ్ అని తగిలించుకుంటే బాగుంటుందేమో.
రాజీ గృహకల్ప్,
రాజీవ్ ఉద్యోగ శ్రీ,
రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయము
రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం,
రాజీవ్ స్వగృహా,
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం,
రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్,
ఇవన్ని చదివాక మీకు ఈ పాటికి అర్థం అయ్యిందనుకుంటా , నేను ఎం చెప్పదలుచు కున్ననో. ఇవ్వన్ని సరిపోలేదు (ఇవి కాకా ఇంకా ఎన్నో ఉన్నాయి) అన్నట్లుగా, ఇప్పుడు మళ్ళి రాష్ట్ర ప్రభుత్వం" తెలుగు లలిత కళా తోరణం" కుడా రాజీవ్ మయం చేసేసింది. ఎంత అన్యాయం, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని డిల్లి అధిష్టానం కాళ్ళ దగ్గర మరొక్కసారి స్వంత ప్రయోజనాల కొరకు తాకట్టు పెట్టారు.
ఇంకా ఎం చూడాల్సి వస్తుందో. రాత్రికి రాత్రి, మన రాష్ట్రం పేరు మార్చేయ గలరు. మనం తెల్ల వారి లేచి చూసే సరికి " రాజివాన్ధ్రప్రదేశ్" అవుతుందేమో ఏదో ఒక రోజు. చార్మినార్ రాజీవ్ మినార్ గా, తిరుమల కొండలు కుడా చివరికి రాజీవ్ కొండలు చేస్తారేమో !. ప్రతీ ముఖ్యమంత్రి తమ పేరు కు ముందు రాజీవ్ అని తగిలించుకుంటే బాగుంటుందేమో.
రాజీవ్, ఇందిరా అనుమానం లేదు వాళ్ళు మన నేతలు. అంత మాత్రం చేత దేనికి పడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా. చివరికి టాయిలెట్స్ కి పెట్టేలా తయారవుతున్నారు. దీనికి ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టక తప్పదు, లేకపోతె వాళ్ళ గౌరవం ఆ పార్టీ నాయకులే మట్టిలో కలిపేల ఉన్నారు.
ఆసక్తి గల వాళ్ళు "రాజీవ్ ని మా మీద రుద్దొద్దు -అనే వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టండి" సుజాత గారి బ్లాగ్ చదవండి.
ఆసక్తి గల వాళ్ళు "రాజీవ్ ని మా మీద రుద్దొద్దు -అనే వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టండి" సుజాత గారి బ్లాగ్ చదవండి.
Saturday, October 23, 2010
ఒగ్గు కథకుడు మిద్దె రాములు ... క్యాన్సర్ ఆస్పత్రిలో...
ఈ రోజు నాకో s.m.s. సందేశం. " తెలంగాణా ఒగ్గు కథకుడు మిద్దె రాములు కు క్యాన్సర్ . యెన్ .టి.ఆర్. క్యాన్సర్ హాస్పిటల్ లో 3rd ఫ్లోర్ , బెడ్ నేఁ ౩౨౪, పైసలు లేక ఇబ్బందులు. ప్లీస్ హెల్ప్ ఫైనాన్సియల్లీ " చూడగానే మనసు కాసేపు చలించింది.
ఒగ్గుకతకు అంతర్జాతీయ క్యాతిని తెచ్చిన వ్యక్తి మిద్దె రాములు. నిరక్షరాస్యుడైనా భాష, యాసను తానె రచిస్తూ, తనదైన శైలిలో చిన్నప్పటినుంచి ఒగ్గుకతకు ప్రాణం పోస్తూ , కథే ప్రాణంగా జీవించిన వ్యక్తి. అతని గ్రామానికే చెందిన మరో తెలుగు ముద్దు బిడ్డ శ్రీ సి.నా.రే.సహకారంతో అంచలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. రాములు కథ వినిపిస్తున్నారంటే తెలంగాణా జిల్లలల్లో గ్రామీణ ప్రాంతాలల్లో జనాలు వినేందుకు తండోపతండాలుగా తరలి వస్తారంటే అతిశయోక్తి కాదు. నెత్తిన బోనంతో ఒగ్గు కథ ప్రారంభించాడంటే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సభాస్తలి వద్దకు చేరుకొని శ్రద్ధగా ఆలకిస్తారు. 1990 లో ప్రపంచ తెలుగు మహా సభలో తన కథలు ప్రదర్శించి తెలుగు వారిని అబ్బురపరిచిన రాములు, అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ , ప్రధాన మంత్రి ఇందిరా ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం క్యాన్సర్ తో హైదరాబాద్ లో చికిత్శ పొందుతున్నారు. చుడతందుకు పోయిన సాక్షి బృందం తో అయన భార్య దేవవ్వ " చిన్నప్పట్నుంచి ఒగ్గుకతనే నమ్ముకుని బతికిండు.గవర్నమెంట్ గురించి జనాలకు తెలిసే విధంగా కథలు అల్లిండు.అందరికి అర్థం అయ్యేలా కథలు చెప్పిండు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదయ్యా. ఇప్పటికే ఆరు లక్షలు ఖర్చయినాయి. ఏమి లాభం లేదు. మంచంల ఉంది గుడా ఒగ్గుకతకే అంటుండు" అంటూ రోదిన్చిందట.
ఈ వార్త చుసిన తర్వాత ప్రభుత్వం అన్ని విధాల ఆడుకొంతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టి.ఆర్. ఎస్ అధినేత కే.సి.ఆర్ కుడా పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష ఇవ్వడం తో పాటు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. సంతోషించాల్సిన విషయం. రాములు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకోవాలని ఒగ్గుకతకు ప్రాణం పోశిన , ఆ ఒగ్గు కథే అతన్ని నిలబెట్టాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ.......
Sunday, October 3, 2010
ఎంత దారుణం....అమానుషం
గ్వటెమల లో సుమారు ఏడు వందల మంది ఖైదీలు, మానసిక రోగులు, సైనికులు అమెరికన్ వైద్యుల ప్రయోగాలకు గినీ పిగ్స్ లా ఉపయోగపడ్డారని, 1946 -48 మధ్య కాలం లో జరిగిన ఈ అకృత్యాలు వెలుగులోకి రావడంతో , అమెరిక విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ వెంటనే గ్వాటెమాలా కి క్షమాపణలు చెప్పింది. బాదితులందరికి కూడా క్షమాపణలు చెబుతున్నామని , పశ్చాత్తాపం తెలిపి చేతులు దులిపేసుకున్త్ది .
అసలు గ్వాటెమాలా లో ఏమి జరిగిందో తెలిస్తే , మన వళ్ళు జలదరిస్తుంది. గ్వాటెమాలా ఖైదీలను, మానసిక రోగులను, సైనికులను అమెరికన్ వైద్యులు తమ ప్రయోగాల కోసం గినీ పిగ్స్ మాదిరిగా ఉపయోగించుకొన్నారట , ఎంత అమానుషం. పెన్సిలిన్ ప్రభావాన్ని పరీక్షించేందుకు వారికి బలవంతంగా సిఫిలిస్ క్రిములను ఎక్కిన్చారట. ఖైదీలకు సిఫిలిస్ అంటగట్టేందుకు ఆ వ్యాధి సోకిన సెక్స్ వర్కర్లను ఉపయోగించేవారట. సెక్స్ వర్కర్ల ద్వారా సిఫిలిస్ సోకకుంటే, ఖైదీల జననంగాలకు, భుజాలకు, ముఖానికి గాట్లు పెట్టి, ఆ గాయాలపై సిఫిలిస్ బాక్టీరియా ను వెదజల్లేవారట . కొన్ని సందర్బాలలో ఏకంగా ఖైదీలు , మానసిక రోగుల వెన్నెముకలకు సిఫిలిస్ క్రిములను ఇంజెక్ట్ చేసేవారట. సిఫిలిస్ సోకిన తర్వాత వారికి పెన్సిలిన్ ఇచ్చేవారు. వారి ప్రయోగాలలో సిఫిలిస్ నయమయ్యింది లేనిది మాత్రం తెలపలేదు.
వ్యక్తుల అనుమతి తీసుకోకుండానే, వారి శరీరాల్లోకి రోగ క్రిములను ఎక్కించడం ఎంత దారుణం. ఎంత అమానుషం. కొస మెరుపు ఏంటంటే, ఇంత దారుణమయిన అకృత్యాలు జరిగినా, అమెరికా విదేశాంగమంత్రి, ఓ చిన్న క్షమాపణ , ఓ పశ్చాత్తాపం , అమెరిక అధ్యక్షుల వారు కూడా, ఓ క్షమాపణ తెలిపి తమ విచారం వెలిబుచ్చారు. అగ్ర రాజ్యాలు ఏమి చిసినా చెల్లుతున్దనా!
"it....is a town where Muslims supply flowers for the temples".
అయోధ్య చారిత్రాత్మక తీర్పు తర్వాత, వచ్చిన వార్తలలో నన్ను ఆకర్షించిన వార్త ఏంటంటే " అయోధ్య లో రామాలయ నిర్మాణం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయల విరాళం". దీనిలో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా. ప్రకటించింది ఎవరనుకుంటున్నారు, "షియా హుస్సేనీ యువజన సంఘం" నిజంగానేనా? ఎన్నో రోజులుగా సాగుతూ వచ్చిన ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుదామంటూ ఆ సంస్థ చీఫ్ శామీల్ శంషీ వెల్లడించారు. ఇంతే ననుకున్నారా, అలహాబాద్ హై కోర్ట్ తీర్పు పై సుప్రీంలో అప్పీల్ చేయవద్దని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ను అడగనున్నట్లు తెల్పుతూ, ఈ తీర్పు పై దేశంలోని ముస్లిం లందరూ అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ఇది అందరం ఆహ్వానించదగ్గ విషయం.
నిజంగా అందరు ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండు. ఈ గొడవలు ఉండకపోవు కదా! కనీసం ఇప్పటికయినా కోర్ట్ తీర్పుని గౌరవించి ఉంటె బాగుంటుందేమో. అయినా ఈ రాజకీయ నాయకులు ఎవరు ఊరుకుంటారు. వాళ్లకు ఏదో ఒకటి కావాలికదా. ప్రజల్లోకి పోవటందుకు వాళ్లకు ఇటువంటి ఇస్సులను వాడుకుంతూనే ఉంటారు. మధ్యలో నలిగేది మామూలు జనం.
ఇంకా ఎవరో అన్నట్లు " లాష్ లక్నో మే హీ దఫన్ హో, ఢిల్లీ మే నహిన్ " ఈ వివాదం యొక్క శకలాలు, ఎమన్నా ఉంటె అవి లక్నో లోనే బూడిద చెయ్యాలి కానీ డిల్లీ లో కాదు. ఇంతటితో దీన్ని వదిలేస్తే బావుంటుంది. 90 ఏళ్ళ హాషిం అన్సారి అయోధ్య వాసి అంటారు బయటి వాళ్ళ ప్రమేయం లేనంత వరకు అయోధ్య ఎప్పుడు ప్రశాంతంగానే ఉంది, " it....is a town where Muslims supply flowers for the temples".
Subscribe to:
Posts (Atom)