Thursday, August 26, 2010

ధీర......విష్ణు ప్రియ

వివాహ సందర్భంగా డబ్బు, అందం, చూస్తారు కాని సంస్కారం ఎలా చూడాలని   tv9  ఆంకర్ ప్రశ్న........నిజమే మన పెద్దలు  ఏనాడో చెప్పారు. వివాహం నిర్ణయం చేసేముందు ఇటు  ఏడు తరాలు, అటు ఏడు తరాలు చూడాలని.  ఇది ఈ రోజుల్లో సాధ్యమా?

ధైర్యంగా  తన కీచక మామ, మరియు భర్త ను ఎదిరించి, బయటికి వచ్చిన ఆ ఆడ కూతురుని మెచ్చుకోవాలి. ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన అండ అబినందనీయం.

భయపడుతూ ఇలా బయటికి రాని వారి సంగతి ఏమిటి?  ఇలా దైర్యంగా బయటికి, మరియు మీడియా ముందుకు వచ్చిందంటే , పాపం ఆ అమ్మాయి ఎంత క్షోభ, మానసిక వ్యధ, టార్చర్ అనుభవించి ఉండి ఉండాలి.

ఆమె గద్గద  స్వరంతో , చేతులెత్తి  మొక్కుతూ, " నాకు  న్యాయం కావాలి " అని అడుగుతుంది.  పాపం ఇప్పటికి వాళ్ళు రియలైజ్ కావాలని అనుకుంటుంది. ఆడ వాసన, రుచి మరిగిన ఆ మృగాలు రియలైజ్ అవుతాయా?

ఆమె కోరుకున్నట్లు ఆ కేస్  వాదించేతందుకు   ఎవ్వరు  ముందుకు రాకూడదు. చట్టం లొసుగులతో వాళ్ళు  ఈ సభ్య సమంజంలో తిరగకూడదు.  కసబ్  కేస్ టేకప్ చేసేంత ఉదార స్వభావమున్న గడ్డ మరి మన భారత దేశం.   కాని వాళ్ళు జీవితాంతం ఉచలు లెక్కపెడుతూ ఉండాలి. 

ఆ కేస్ ఎవరు వాదిన్చగుడదని  ఓరల్ గా సూచనలు చేసిన బార్ కౌన్సిల్ ని , అలాగే ఈ విషయాన్ని తెలియజేసి విష్ణుప్రియ కు న్యాయం జరిగేలా చుసిన tv9  ని అభినందించాలి. ముఖ్యంగా  వెంబడే స్పందించిన మన హోం శాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారిని కూడా అభిననందించాలి. 

తన చదువు పూర్తి చేసుకుని, తన కాళ్ళ మీద తానూ నిలబడాలని విష్ణుప్రియ కోరుకుంటుంది. ఆమెకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుందాం.ఇల్లాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూద్దాం.


Tuesday, August 24, 2010

దట్ ఇస్ ఇండియన్ పోలీసు

ఇదీ ఏ అగ్ఫనిస్తాన్ లోనో ఏ తాలిబాన్ లోనో కాదండి ! మన ఇండియా లో జమ్మూ-కాశ్మీర్ లో మన పోలీసులు ఆడ  వాళ్ళను పబ్లిగ్గా గౌరవించిన తీరు ఈ ఫోటోలలో చుడండి!

పాపం, వాళ్ళ సోదరులకు ఏమయ్యిందో అని అడగటానికి వొచ్చిన ఆడవాళ్ళకు, మన ఇండియన్ పోలీసు మర్యాద!

దట్ ఇస్ ఇండియన్ పోలీసు...........

Sunday, August 22, 2010

మనస్పూర్తిగా పొగడండి !

నేనీ దారిలో ఒకే సారి నడుస్తాను. అందుచేత నేనూ ఎవ్వరి  పట్లయినా మంచిగాను, దయతోనూ ప్రవర్తిన్చదల్చుకుంటే, అది ఇప్పుడే సాధ్యం. దీన్ని నేనూ వాయిదా వెయ్యకూడదు, ఉపేక్షించకూడదు, ఎందుకంటే నేను మళ్లీ ఇటు వయిపు రాకపోవచ్చు.

" నేను   కలిసే ప్రతివ్యక్తి ఏదో విదంగా నా కన్నా గొప్ప వాడె. అందుచేత అతని వద్ద నేర్చుకునేది ఉంటుంది," అని అంటాడు ఎమెర్సన్.

ఎమెర్సన్ నిజంగా అలా అనిపించింది అంటే, మీకు నాకు వెయ్యి రెట్లు ఎక్కువగా అలా అనిపించాలి కదా? మనం మనం సాధించిన వాటి గురించి, మన అవసరాల గురించి మరిచిపోదాం. ఎదుటి మనిషిలోని మంచి గుణాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇక ముఖస్తుతి మరిచిపొండి. మనస్పూర్తిగా పొగడండి.  "మనస్పూర్తిగా మెచ్చుకోండి, అమితంగా పొగడండి." ఇతరులు మీ మాటల్ని పదిలపరుచుకుంటారు, మనసులో భద్రపరుచుకొని, ఎంతొ విలువనిచ్చి తమ జీవితమంతా తలచుకుంటూ ఉంటారు . మీరు మరిచిపోయినా ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా వాటిని చెప్పుకుంటూ ఉంటారు. 

పొగడండి అంటే లేని వాటిని ఉన్నట్లుగా కాదండి. ఎదుటి వ్యక్తి లోని మంచి గుణాలని అర్థం చేసుకొని వారిని మెచ్చుకొంటే , వాళ్ళలోని పాజిటివ్ పాయింట్స్ ని పొగిడితే, ఎవరయినా ఎలా మరిచిపోతారు. అప్పుడు ఈ కోపాలు, ద్వేషాలు ఏవి లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటారు. సాధ్యమయ్యే పనేన.  ప్రయత్నిస్తే సాద్యం కానిది అంటూ ఉండదంటారు . మనము ప్రయత్నిస్తే తప్పేమీ లేదు కదా. 

    

తల్లి మనసు



ఆకలితో అలమటించే పశువు కూడా తల్లి మనసుకు శిశువు తో 
సమానమే. అందుకే రాజస్తాన్ లోని భికనీర్ లో తల్లి ఆవు మరణించడంతో ఒంటరయిన లేగా దూడ కు తన స్తనాన్ని 
 అందిస్తున్న మాతృమూర్తి.......

మాతృ హృదయం  ఎంత గొప్పది,  పశువయినా కూడా  ఆమె స్పందించిన తీరు  ప్రశంసనీయం. 

Saturday, August 21, 2010

చంద్రబాబు.........స్కూల్ బ్యాగు..

తెలుగు దేశం అధినేత ఫై ప్రభ్త్వ రంగ సంస్థల శాసనసభ కమిటీ చైర్మెన్ ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పిన కొంటె కథ :


విమానంలో ఒక మత  పెద్ద, సంఘ సేవకురాలు, చంద్రబాబు,విద్యార్ధి, మాష్టారు ప్రయాణం చేస్తున్నారు. అకస్మాతుగా విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అందరు ప్యారచుట్ లు తగిలించుకొని దుకాలి. 


అయితే, విమానంలో ఐదుగురు ప్రయాణీకులు ఉంటె 4  పారాచూట్ బ్యాగ్ లు మాత్రమే ఉన్నాయి.ముందుగా మతపెద్ద, సంఘసేవకురాలు క్రిందకు దూకారు.


 తరువాత నా అవసరం ప్రజలకు ఉందంటూ చంద్రబాబు భుజానికి బ్యాగు తగిలించుకొని దుకేశారు. అయితే, ప్యారాచుట్ కు బదులు విద్యార్థి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని దుకేశారు,


 దీంతో విద్యార్థి, మాస్టారికి ప్యారాచుట్ లు లభించాయి. బాబు మధ్యంతర కలలు స్కూల్ బ్యాగు కథ లా  ఉంటాయి.  ఇదండీ ఏరాసు  గారు చెప్పిన కొంటె కథ!.