వివాహ సందర్భంగా డబ్బు, అందం, చూస్తారు కాని సంస్కారం ఎలా చూడాలని tv9 ఆంకర్ ప్రశ్న........నిజమే మన పెద్దలు ఏనాడో చెప్పారు. వివాహం నిర్ణయం చేసేముందు ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు చూడాలని. ఇది ఈ రోజుల్లో సాధ్యమా?
ధైర్యంగా తన కీచక మామ, మరియు భర్త ను ఎదిరించి, బయటికి వచ్చిన ఆ ఆడ కూతురుని మెచ్చుకోవాలి. ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన అండ అబినందనీయం.
భయపడుతూ ఇలా బయటికి రాని వారి సంగతి ఏమిటి? ఇలా దైర్యంగా బయటికి, మరియు మీడియా ముందుకు వచ్చిందంటే , పాపం ఆ అమ్మాయి ఎంత క్షోభ, మానసిక వ్యధ, టార్చర్ అనుభవించి ఉండి ఉండాలి.
ఆమె గద్గద స్వరంతో , చేతులెత్తి మొక్కుతూ, " నాకు న్యాయం కావాలి " అని అడుగుతుంది. పాపం ఇప్పటికి వాళ్ళు రియలైజ్ కావాలని అనుకుంటుంది. ఆడ వాసన, రుచి మరిగిన ఆ మృగాలు రియలైజ్ అవుతాయా?
ఆమె కోరుకున్నట్లు ఆ కేస్ వాదించేతందుకు ఎవ్వరు ముందుకు రాకూడదు. చట్టం లొసుగులతో వాళ్ళు ఈ సభ్య సమంజంలో తిరగకూడదు. కసబ్ కేస్ టేకప్ చేసేంత ఉదార స్వభావమున్న గడ్డ మరి మన భారత దేశం. కాని వాళ్ళు జీవితాంతం ఉచలు లెక్కపెడుతూ ఉండాలి.
ఆ కేస్ ఎవరు వాదిన్చగుడదని ఓరల్ గా సూచనలు చేసిన బార్ కౌన్సిల్ ని , అలాగే ఈ విషయాన్ని తెలియజేసి విష్ణుప్రియ కు న్యాయం జరిగేలా చుసిన tv9 ని అభినందించాలి. ముఖ్యంగా వెంబడే స్పందించిన మన హోం శాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారిని కూడా అభిననందించాలి.
తన చదువు పూర్తి చేసుకుని, తన కాళ్ళ మీద తానూ నిలబడాలని విష్ణుప్రియ కోరుకుంటుంది. ఆమెకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుందాం.ఇల్లాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూద్దాం.
yeah... i appriciate vishnupriya...inkaa chalaa mandi aadavaallu ilaa dairyanga tama badhalaku parishkaaralu vetukkovaalani aashistunnanu.tv9 vaarini media mottam kooda andariki ide vidanga spandinchi nyaayam jarigetlu choodaali.
ReplyDeleteika ee aadavaalla problems ilaa media valanainaa parishkaraam avute society chalaa bagu padutundi.
ReplyDeleteమీరన్నట్లు మీడియా TRP రేటింగ్ ల కొరకు కాకుండా. మరియు చీప్ పబ్లిసిటీ కొరకు కాకుండా నిజంగా పాసిటివ్ గా చేస్తే బాగా నే ఉంటుంది
ReplyDeletefirst i would like to thank Ntv,n Sakshi first they took this News later it goes to Tv9,Tv9 knows hows to make a news what ever today vishunu got a confidence to face problem,thank you all News Channels.Vishnu ALL THE BEST
ReplyDelete