నేనీ దారిలో ఒకే సారి నడుస్తాను. అందుచేత నేనూ ఎవ్వరి పట్లయినా మంచిగాను, దయతోనూ ప్రవర్తిన్చదల్చుకుంటే, అది ఇప్పుడే సాధ్యం. దీన్ని నేనూ వాయిదా వెయ్యకూడదు, ఉపేక్షించకూడదు, ఎందుకంటే నేను మళ్లీ ఇటు వయిపు రాకపోవచ్చు.
" నేను కలిసే ప్రతివ్యక్తి ఏదో విదంగా నా కన్నా గొప్ప వాడె. అందుచేత అతని వద్ద నేర్చుకునేది ఉంటుంది," అని అంటాడు ఎమెర్సన్.
ఎమెర్సన్ నిజంగా అలా అనిపించింది అంటే, మీకు నాకు వెయ్యి రెట్లు ఎక్కువగా అలా అనిపించాలి కదా? మనం మనం సాధించిన వాటి గురించి, మన అవసరాల గురించి మరిచిపోదాం. ఎదుటి మనిషిలోని మంచి గుణాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇక ముఖస్తుతి మరిచిపొండి. మనస్పూర్తిగా పొగడండి. "మనస్పూర్తిగా మెచ్చుకోండి, అమితంగా పొగడండి." ఇతరులు మీ మాటల్ని పదిలపరుచుకుంటారు, మనసులో భద్రపరుచుకొని, ఎంతొ విలువనిచ్చి తమ జీవితమంతా తలచుకుంటూ ఉంటారు . మీరు మరిచిపోయినా ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా వాటిని చెప్పుకుంటూ ఉంటారు.
పొగడండి అంటే లేని వాటిని ఉన్నట్లుగా కాదండి. ఎదుటి వ్యక్తి లోని మంచి గుణాలని అర్థం చేసుకొని వారిని మెచ్చుకొంటే , వాళ్ళలోని పాజిటివ్ పాయింట్స్ ని పొగిడితే, ఎవరయినా ఎలా మరిచిపోతారు. అప్పుడు ఈ కోపాలు, ద్వేషాలు ఏవి లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటారు. సాధ్యమయ్యే పనేన. ప్రయత్నిస్తే సాద్యం కానిది అంటూ ఉండదంటారు . మనము ప్రయత్నిస్తే తప్పేమీ లేదు కదా.
chalabaga chapparandi bhanugaru andharu prayatnisthe baguntundhi
ReplyDeleteavunandi thanks
ReplyDeleteమీది ఎంత గొప్ప మనసో...చాల బాగ చెప్పారు.
ReplyDelete