Sunday, November 7, 2010

ఓ కార్పోరేట్ కాలేజ్ విద్యార్థి ఆవేదన


కార్పోరేట్ కాలేజీల్లో పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారో , సరదా గా చూపించిన ఓ వీడియో,  చూసి ఎంజాయ్ చేయండి. ఇదీ బొమ్మరిల్లు సినిమా లోని మంచి సీన్ కి ఓ పేరడీ.

LOOK AT YOUR SELF AFTER WATCHING THIS VEDIO

what a girl wants 2 hear ...n what a boy thinks

ఒక అమ్మాయి ఏమి వినాలనుకుంటుందో ,  ఆ అబ్బాయి ఏమి ఆలోచిస్తున్నాడో చూడండి ఈ క్రింది వీడియో.

 

Monday, October 25, 2010

అంతా రాజీవుని మయం

రాజీవ్ ఆరోగ్య శ్రీ,
రాజీ గృహకల్ప్,
రాజీవ్ ఉద్యోగ శ్రీ,
రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయము
రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం,
రాజీవ్ స్వగృహా,
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం,
రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్,


ఇవన్ని  చదివాక మీకు ఈ పాటికి అర్థం అయ్యిందనుకుంటా , నేను ఎం చెప్పదలుచు కున్ననో. ఇవ్వన్ని సరిపోలేదు (ఇవి కాకా ఇంకా ఎన్నో ఉన్నాయి) అన్నట్లుగా, ఇప్పుడు మళ్ళి  రాష్ట్ర ప్రభుత్వం" తెలుగు లలిత కళా తోరణం" కుడా రాజీవ్ మయం  చేసేసింది. ఎంత అన్యాయం, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని డిల్లి అధిష్టానం కాళ్ళ దగ్గర మరొక్కసారి స్వంత ప్రయోజనాల కొరకు తాకట్టు పెట్టారు.

ఇంకా ఎం చూడాల్సి వస్తుందో.  రాత్రికి రాత్రి, మన రాష్ట్రం పేరు మార్చేయ గలరు. మనం తెల్ల వారి లేచి చూసే  సరికి "  రాజివాన్ధ్రప్రదేశ్" అవుతుందేమో ఏదో ఒక రోజు. చార్మినార్ రాజీవ్ మినార్ గా, తిరుమల కొండలు కుడా చివరికి రాజీవ్ కొండలు చేస్తారేమో !. ప్రతీ ముఖ్యమంత్రి  తమ పేరు కు ముందు రాజీవ్ అని తగిలించుకుంటే బాగుంటుందేమో. 

 రాజీవ్, ఇందిరా అనుమానం లేదు వాళ్ళు మన నేతలు. అంత మాత్రం చేత దేనికి  పడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా. చివరికి టాయిలెట్స్ కి పెట్టేలా తయారవుతున్నారు. దీనికి ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టక తప్పదు, లేకపోతె వాళ్ళ గౌరవం ఆ పార్టీ నాయకులే మట్టిలో కలిపేల ఉన్నారు.

ఆసక్తి గల వాళ్ళు "రాజీవ్ ని మా మీద రుద్దొద్దు -అనే వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టండి" సుజాత గారి బ్లాగ్ చదవండి.

Saturday, October 23, 2010

ఒగ్గు కథకుడు మిద్దె రాములు ... క్యాన్సర్ ఆస్పత్రిలో...

ఈ రోజు నాకో  s.m.s. సందేశం. " తెలంగాణా ఒగ్గు కథకుడు మిద్దె  రాములు కు క్యాన్సర్ . యెన్ .టి.ఆర్. క్యాన్సర్ హాస్పిటల్ లో 3rd ఫ్లోర్ , బెడ్ నేఁ ౩౨౪, పైసలు లేక ఇబ్బందులు. ప్లీస్  హెల్ప్ ఫైనాన్సియల్లీ "  చూడగానే మనసు కాసేపు చలించింది.

ఒగ్గుకతకు అంతర్జాతీయ క్యాతిని  తెచ్చిన వ్యక్తి మిద్దె రాములు. నిరక్షరాస్యుడైనా  భాష, యాసను తానె రచిస్తూ, తనదైన శైలిలో చిన్నప్పటినుంచి ఒగ్గుకతకు ప్రాణం పోస్తూ , కథే ప్రాణంగా జీవించిన వ్యక్తి.  అతని గ్రామానికే చెందిన మరో తెలుగు ముద్దు బిడ్డ శ్రీ సి.నా.రే.సహకారంతో అంచలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. రాములు కథ వినిపిస్తున్నారంటే తెలంగాణా జిల్లలల్లో గ్రామీణ ప్రాంతాలల్లో జనాలు వినేందుకు తండోపతండాలుగా తరలి వస్తారంటే అతిశయోక్తి కాదు. నెత్తిన బోనంతో ఒగ్గు కథ ప్రారంభించాడంటే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సభాస్తలి వద్దకు చేరుకొని శ్రద్ధగా ఆలకిస్తారు.  1990 లో ప్రపంచ తెలుగు మహా సభలో తన కథలు ప్రదర్శించి తెలుగు వారిని అబ్బురపరిచిన రాములు, అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్  సింగ్ , ప్రధాన మంత్రి ఇందిరా ప్రశంసలు అందుకున్నారు.

ప్రస్తుతం క్యాన్సర్ తో హైదరాబాద్ లో చికిత్శ పొందుతున్నారు. చుడతందుకు పోయిన సాక్షి బృందం తో అయన భార్య దేవవ్వ " చిన్నప్పట్నుంచి  ఒగ్గుకతనే నమ్ముకుని బతికిండు.గవర్నమెంట్ గురించి జనాలకు తెలిసే విధంగా కథలు అల్లిండు.అందరికి అర్థం అయ్యేలా కథలు చెప్పిండు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదయ్యా. ఇప్పటికే  ఆరు లక్షలు ఖర్చయినాయి. ఏమి లాభం లేదు. మంచంల ఉంది గుడా ఒగ్గుకతకే అంటుండు" అంటూ రోదిన్చిందట.

ఈ వార్త చుసిన తర్వాత ప్రభుత్వం అన్ని విధాల ఆడుకొంతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టి.ఆర్. ఎస్ అధినేత కే.సి.ఆర్ కుడా పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష ఇవ్వడం తో పాటు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. సంతోషించాల్సిన విషయం. రాములు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకోవాలని ఒగ్గుకతకు ప్రాణం పోశిన , ఆ ఒగ్గు కథే అతన్ని నిలబెట్టాలని  ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ.......

Sunday, October 3, 2010

ఎంత దారుణం....అమానుషం

గ్వటెమల లో సుమారు ఏడు వందల మంది ఖైదీలు, మానసిక రోగులు, సైనికులు అమెరికన్ వైద్యుల ప్రయోగాలకు గినీ పిగ్స్ లా ఉపయోగపడ్డారని, 1946 -48 మధ్య కాలం లో జరిగిన ఈ అకృత్యాలు వెలుగులోకి రావడంతో , అమెరిక విదేశాంగ శాఖ  మంత్రి హిల్లరీ క్లింటన్ వెంటనే గ్వాటెమాలా కి క్షమాపణలు చెప్పింది. బాదితులందరికి కూడా క్షమాపణలు  చెబుతున్నామని , పశ్చాత్తాపం తెలిపి చేతులు దులిపేసుకున్త్ది .

అసలు గ్వాటెమాలా లో ఏమి జరిగిందో తెలిస్తే , మన వళ్ళు జలదరిస్తుంది. గ్వాటెమాలా ఖైదీలను, మానసిక రోగులను, సైనికులను అమెరికన్ వైద్యులు తమ ప్రయోగాల కోసం గినీ పిగ్స్ మాదిరిగా ఉపయోగించుకొన్నారట , ఎంత అమానుషం. పెన్సిలిన్ ప్రభావాన్ని పరీక్షించేందుకు వారికి బలవంతంగా సిఫిలిస్ క్రిములను ఎక్కిన్చారట. ఖైదీలకు సిఫిలిస్ అంటగట్టేందుకు ఆ వ్యాధి సోకిన సెక్స్ వర్కర్లను ఉపయోగించేవారట. సెక్స్ వర్కర్ల ద్వారా సిఫిలిస్ సోకకుంటే, ఖైదీల జననంగాలకు, భుజాలకు, ముఖానికి గాట్లు పెట్టి, ఆ గాయాలపై సిఫిలిస్ బాక్టీరియా ను వెదజల్లేవారట . కొన్ని సందర్బాలలో ఏకంగా ఖైదీలు , మానసిక రోగుల వెన్నెముకలకు   సిఫిలిస్ క్రిములను ఇంజెక్ట్ చేసేవారట. సిఫిలిస్ సోకిన తర్వాత వారికి  పెన్సిలిన్ ఇచ్చేవారు.  వారి ప్రయోగాలలో సిఫిలిస్ నయమయ్యింది లేనిది మాత్రం తెలపలేదు.

వ్యక్తుల అనుమతి తీసుకోకుండానే, వారి శరీరాల్లోకి  రోగ క్రిములను ఎక్కించడం ఎంత దారుణం. ఎంత అమానుషం. కొస మెరుపు ఏంటంటే, ఇంత దారుణమయిన అకృత్యాలు జరిగినా, అమెరికా విదేశాంగమంత్రి, ఓ చిన్న క్షమాపణ , ఓ పశ్చాత్తాపం ,  అమెరిక అధ్యక్షుల వారు కూడా, ఓ క్షమాపణ తెలిపి తమ విచారం వెలిబుచ్చారు. అగ్ర రాజ్యాలు ఏమి చిసినా చెల్లుతున్దనా! 

"it....is a town where Muslims supply flowers for the temples".

అయోధ్య చారిత్రాత్మక తీర్పు తర్వాత, వచ్చిన వార్తలలో నన్ను ఆకర్షించిన  వార్త ఏంటంటే " అయోధ్య లో రామాలయ నిర్మాణం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయల విరాళం".  దీనిలో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా. ప్రకటించింది ఎవరనుకుంటున్నారు, "షియా హుస్సేనీ యువజన సంఘం" నిజంగానేనా? ఎన్నో రోజులుగా సాగుతూ వచ్చిన ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుదామంటూ ఆ సంస్థ చీఫ్ శామీల్ శంషీ వెల్లడించారు. ఇంతే ననుకున్నారా, అలహాబాద్ హై కోర్ట్ తీర్పు పై సుప్రీంలో అప్పీల్ చేయవద్దని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ను అడగనున్నట్లు తెల్పుతూ, ఈ తీర్పు పై దేశంలోని ముస్లిం లందరూ అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించడం  దురదృష్టకరమన్నారు. ఇది అందరం ఆహ్వానించదగ్గ విషయం.

నిజంగా అందరు ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండు.  ఈ గొడవలు ఉండకపోవు కదా! కనీసం ఇప్పటికయినా కోర్ట్ తీర్పుని గౌరవించి ఉంటె బాగుంటుందేమో. అయినా ఈ రాజకీయ నాయకులు ఎవరు ఊరుకుంటారు.  వాళ్లకు ఏదో ఒకటి కావాలికదా. ప్రజల్లోకి పోవటందుకు వాళ్లకు ఇటువంటి ఇస్సులను వాడుకుంతూనే ఉంటారు. మధ్యలో నలిగేది మామూలు జనం.

 ఇంకా ఎవరో అన్నట్లు " లాష్ లక్నో మే హీ దఫన్ హో, ఢిల్లీ మే నహిన్ " ఈ వివాదం యొక్క శకలాలు, ఎమన్నా ఉంటె అవి లక్నో  లోనే బూడిద చెయ్యాలి కానీ డిల్లీ లో కాదు. ఇంతటితో దీన్ని వదిలేస్తే బావుంటుంది. 90 ఏళ్ళ హాషిం అన్సారి అయోధ్య వాసి  అంటారు బయటి వాళ్ళ ప్రమేయం లేనంత వరకు అయోధ్య ఎప్పుడు ప్రశాంతంగానే ఉంది, " it....is a town where Muslims supply flowers for the temples".

Friday, September 24, 2010

పాప తోడుగా పార్లమెంట్ కు

యూరోపియన్ పార్లమెంట్‌లో ముప్పై ఏళ్ల లిసియా రోన్‌జుల్లి - ఇటాలియన్ సభ్యురాలు. ఇటీవల పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో తన నెల పాపని నడుంకి కట్టుకొని వచ్చింది. 

నా కూతురు విట్టోరియాని పార్లమెంట్ సెషన్స్‌కి తీసుకురావటం వెనుక - వ్యక్తిగత జీవితం.. ఉద్యోగ బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరన్న అంశాన్ని చాటి చెప్పటానికే’ నంటోంది.

బేబీ కేర్ సెంటర్లు లేవా? లేక ఇంట్లో ఆయాలు లేరా? అన్న ప్రశ్నని పక్కనపెట్టి - ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా? మరోటి అనుకున్నా? తన పరిస్థితిని ‘సింబాలిక్’గా వివరించింది


ఎవరెన్ని అర్థాలు మాట్లాడుకున్నా.. తన వాదనని నిర్మొహమాటంగా తెలియజేసి మహిళల స్థితిగతులను లోకానికి చాటింది.

జీవితం ఓ కప్పు కాఫీ లాంటిది.

లైఫ్ ఇస్ లైక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ....జీవితం గురించి ఓ ప్రొఫెస్సర్ , ఆయన స్టూడెంట్స్ కి జీవితాన్ని  కాఫీ మరియ కప్పులతో  పోలుస్తూ ఎంత చక్కగా చెప్పాడో  చూడండి

 ">

Sunday, September 19, 2010

శ్రీ కుందుర్తి " తెలంగాణా" కు పీటికలో గోపీచంద్ గేయ రచన

ఇది తెలంగాణా కన్నీటి గాథ
ఒక మహా కవి యేగాజిమ్మిన
అగ్ని కణాల రొద,
తల్లి రాల్చిన అశ్రుకనాలివి 
వాటిసేగల పొగల వెనక
ఆకృతిని నిర్మించి, మనసులను కరిగించి
ఆర్ద్రతను పెంచి , లోకపు చీకట్ల
దివ్వెలను వెలిగించి, హద్దులను మరిపించి
విశ్వ దృష్టిని  పెంచు ఈ కవి,
ఓ కవీ, నీకు శుభము
మాతృశ్రీ కన్నీటి చుక్కలకు
నవ్యరీతులు దిద్దిన నీకు శుభము
శ్రీ శ్రీ భుజములపైనుంచి
లోకమును పరికించు, నీకు శుభము
దీనుల ఆర్తారవముల  నినదించు
లోకకల్యానమునకై పరితపించు
కవీ, ఓ కవీ, నీకు శుభము


(గోపీచంద్ స్మారక సంచిక నుంచి, రచనలో ప్రచురితమయినది  )

Wednesday, September 1, 2010

రాజశేఖరా ....



అప్పుడే  సంవత్స్తరం అయిపోయిందా ......ఇంకా ఆ జ్ఞాపకాలు మనసులో పచ్చిగానే మనసును కోస్తూ..... ఆ రోజు నిజంగా ఎంత టెన్షన్... ఎంత మంది గుండెలు పట్టుకొని , టి.వి. లకు అతుక్కొని...... ఎ వానల కొరకు పాద యాత్రలు చేసాడో,  ఆ వానలోనే ..ప్చ్ .....అయినా ఆ దేవుడికి కరుణ లేదు. పార్టీలకు అతీతంగా ఆలోచించిన, ఎలా ఆలోచించినా ఒక మంచి లీడర్, ప్రజలకు దగ్గరి మనిషి,  ప్రజా నాయకుడు. ఆ హుందాతనం, ఆ నవ్వు  ఇంకేవరిలో కనిపించవు .  రాజశేఖరా అందుకో మా నివాళులు

Thursday, August 26, 2010

ధీర......విష్ణు ప్రియ

వివాహ సందర్భంగా డబ్బు, అందం, చూస్తారు కాని సంస్కారం ఎలా చూడాలని   tv9  ఆంకర్ ప్రశ్న........నిజమే మన పెద్దలు  ఏనాడో చెప్పారు. వివాహం నిర్ణయం చేసేముందు ఇటు  ఏడు తరాలు, అటు ఏడు తరాలు చూడాలని.  ఇది ఈ రోజుల్లో సాధ్యమా?

ధైర్యంగా  తన కీచక మామ, మరియు భర్త ను ఎదిరించి, బయటికి వచ్చిన ఆ ఆడ కూతురుని మెచ్చుకోవాలి. ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన అండ అబినందనీయం.

భయపడుతూ ఇలా బయటికి రాని వారి సంగతి ఏమిటి?  ఇలా దైర్యంగా బయటికి, మరియు మీడియా ముందుకు వచ్చిందంటే , పాపం ఆ అమ్మాయి ఎంత క్షోభ, మానసిక వ్యధ, టార్చర్ అనుభవించి ఉండి ఉండాలి.

ఆమె గద్గద  స్వరంతో , చేతులెత్తి  మొక్కుతూ, " నాకు  న్యాయం కావాలి " అని అడుగుతుంది.  పాపం ఇప్పటికి వాళ్ళు రియలైజ్ కావాలని అనుకుంటుంది. ఆడ వాసన, రుచి మరిగిన ఆ మృగాలు రియలైజ్ అవుతాయా?

ఆమె కోరుకున్నట్లు ఆ కేస్  వాదించేతందుకు   ఎవ్వరు  ముందుకు రాకూడదు. చట్టం లొసుగులతో వాళ్ళు  ఈ సభ్య సమంజంలో తిరగకూడదు.  కసబ్  కేస్ టేకప్ చేసేంత ఉదార స్వభావమున్న గడ్డ మరి మన భారత దేశం.   కాని వాళ్ళు జీవితాంతం ఉచలు లెక్కపెడుతూ ఉండాలి. 

ఆ కేస్ ఎవరు వాదిన్చగుడదని  ఓరల్ గా సూచనలు చేసిన బార్ కౌన్సిల్ ని , అలాగే ఈ విషయాన్ని తెలియజేసి విష్ణుప్రియ కు న్యాయం జరిగేలా చుసిన tv9  ని అభినందించాలి. ముఖ్యంగా  వెంబడే స్పందించిన మన హోం శాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారిని కూడా అభిననందించాలి. 

తన చదువు పూర్తి చేసుకుని, తన కాళ్ళ మీద తానూ నిలబడాలని విష్ణుప్రియ కోరుకుంటుంది. ఆమెకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుందాం.ఇల్లాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూద్దాం.


Tuesday, August 24, 2010

దట్ ఇస్ ఇండియన్ పోలీసు

ఇదీ ఏ అగ్ఫనిస్తాన్ లోనో ఏ తాలిబాన్ లోనో కాదండి ! మన ఇండియా లో జమ్మూ-కాశ్మీర్ లో మన పోలీసులు ఆడ  వాళ్ళను పబ్లిగ్గా గౌరవించిన తీరు ఈ ఫోటోలలో చుడండి!

పాపం, వాళ్ళ సోదరులకు ఏమయ్యిందో అని అడగటానికి వొచ్చిన ఆడవాళ్ళకు, మన ఇండియన్ పోలీసు మర్యాద!

దట్ ఇస్ ఇండియన్ పోలీసు...........

Sunday, August 22, 2010

మనస్పూర్తిగా పొగడండి !

నేనీ దారిలో ఒకే సారి నడుస్తాను. అందుచేత నేనూ ఎవ్వరి  పట్లయినా మంచిగాను, దయతోనూ ప్రవర్తిన్చదల్చుకుంటే, అది ఇప్పుడే సాధ్యం. దీన్ని నేనూ వాయిదా వెయ్యకూడదు, ఉపేక్షించకూడదు, ఎందుకంటే నేను మళ్లీ ఇటు వయిపు రాకపోవచ్చు.

" నేను   కలిసే ప్రతివ్యక్తి ఏదో విదంగా నా కన్నా గొప్ప వాడె. అందుచేత అతని వద్ద నేర్చుకునేది ఉంటుంది," అని అంటాడు ఎమెర్సన్.

ఎమెర్సన్ నిజంగా అలా అనిపించింది అంటే, మీకు నాకు వెయ్యి రెట్లు ఎక్కువగా అలా అనిపించాలి కదా? మనం మనం సాధించిన వాటి గురించి, మన అవసరాల గురించి మరిచిపోదాం. ఎదుటి మనిషిలోని మంచి గుణాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇక ముఖస్తుతి మరిచిపొండి. మనస్పూర్తిగా పొగడండి.  "మనస్పూర్తిగా మెచ్చుకోండి, అమితంగా పొగడండి." ఇతరులు మీ మాటల్ని పదిలపరుచుకుంటారు, మనసులో భద్రపరుచుకొని, ఎంతొ విలువనిచ్చి తమ జీవితమంతా తలచుకుంటూ ఉంటారు . మీరు మరిచిపోయినా ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా వాటిని చెప్పుకుంటూ ఉంటారు. 

పొగడండి అంటే లేని వాటిని ఉన్నట్లుగా కాదండి. ఎదుటి వ్యక్తి లోని మంచి గుణాలని అర్థం చేసుకొని వారిని మెచ్చుకొంటే , వాళ్ళలోని పాజిటివ్ పాయింట్స్ ని పొగిడితే, ఎవరయినా ఎలా మరిచిపోతారు. అప్పుడు ఈ కోపాలు, ద్వేషాలు ఏవి లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటారు. సాధ్యమయ్యే పనేన.  ప్రయత్నిస్తే సాద్యం కానిది అంటూ ఉండదంటారు . మనము ప్రయత్నిస్తే తప్పేమీ లేదు కదా. 

    

తల్లి మనసు



ఆకలితో అలమటించే పశువు కూడా తల్లి మనసుకు శిశువు తో 
సమానమే. అందుకే రాజస్తాన్ లోని భికనీర్ లో తల్లి ఆవు మరణించడంతో ఒంటరయిన లేగా దూడ కు తన స్తనాన్ని 
 అందిస్తున్న మాతృమూర్తి.......

మాతృ హృదయం  ఎంత గొప్పది,  పశువయినా కూడా  ఆమె స్పందించిన తీరు  ప్రశంసనీయం. 

Saturday, August 21, 2010

చంద్రబాబు.........స్కూల్ బ్యాగు..

తెలుగు దేశం అధినేత ఫై ప్రభ్త్వ రంగ సంస్థల శాసనసభ కమిటీ చైర్మెన్ ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పిన కొంటె కథ :


విమానంలో ఒక మత  పెద్ద, సంఘ సేవకురాలు, చంద్రబాబు,విద్యార్ధి, మాష్టారు ప్రయాణం చేస్తున్నారు. అకస్మాతుగా విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అందరు ప్యారచుట్ లు తగిలించుకొని దుకాలి. 


అయితే, విమానంలో ఐదుగురు ప్రయాణీకులు ఉంటె 4  పారాచూట్ బ్యాగ్ లు మాత్రమే ఉన్నాయి.ముందుగా మతపెద్ద, సంఘసేవకురాలు క్రిందకు దూకారు.


 తరువాత నా అవసరం ప్రజలకు ఉందంటూ చంద్రబాబు భుజానికి బ్యాగు తగిలించుకొని దుకేశారు. అయితే, ప్యారాచుట్ కు బదులు విద్యార్థి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని దుకేశారు,


 దీంతో విద్యార్థి, మాస్టారికి ప్యారాచుట్ లు లభించాయి. బాబు మధ్యంతర కలలు స్కూల్ బ్యాగు కథ లా  ఉంటాయి.  ఇదండీ ఏరాసు  గారు చెప్పిన కొంటె కథ!.